అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించిన వైయస్సార్‌సీపీ

యర్రబాలెం(క్రోసూరు): మండలంలోని యర్రబాలెం గ్రామంలో గురువారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధిత కుటుంబీకులను శుక్రవారం వైయస్సార్‌సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగమనోహరనాయుడు పరామర్శించారు. సంఘటన స్ధలానికి చేరుకున్న కావటి మనోహరనాయుడు జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తపరిచారు. బాధితులకు ఆర్ధిక సహాయం అందచేసారు. పూర్తిగా నష్టపోయిన కుటుంబాలు నల్లగొండ కొండలరావు, నల్లగొండ గంగరావులకు ఒక్కొక్కరికి రూ.5వేలు, పాక్షికంగా నష్టపోయిన వారి సిమ్మిసెట్టి కోటయ్య, ఉయ్యాల నాగేశ్వరరావు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3వేలు చొప్పున అందజేసారు. 

వైయస్సార్‌సీపీ అండగా ఉంటుందని వారికి ధీమా కల్పించారు.
వెంటనే ఆదుకోవాలని తహశీల్దార్‌కు ఫోను: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని తహశీల్దార్‌డి. వేంకటేశ్వరరావుకు కావటి మనోహరనాయుడు ఫోను చేసారు. అంతేకాక బాధితులకు తక్షణమే ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
బాధితుల్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌సయ్యద్‌అబ్దుల్‌రహీం, క్రోసూరు గ్రామకమిటీ అద్యక్షుడు అనుముల కోటిరెడ్డి, యర్రబాలెం గ్రామకమిటీ అద్యక్షుడు గుడేటి ఏసుబాబు,ఎస్టీ సెల్‌మండల అద్యక్షుడు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి షేక్‌మస్తాన్, అంజయ్య, వెంకయ్య, మేళం ధామస్, కాల్వపల్లి ఏసురెడ్డి, నారుశ్రీనివాసరెడ్డి, పైర్ధమాణిక్యరావు, పెరికల అజయ్, జిడుగు రాంసెట్టి లక్ష్మీనారాయణ, వేణుగోపాలరెడ్డి, తిప్పిరెడ్డి అప్పిరెడ్డి,కాల్వపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top