చంద్రబాబు ఎటువైపో తేల్చుకోవాలి

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా సాధనకు మేం పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తారో, లేదంటే బీజేపీతో అండగా ఉంటారో చంద్రబాబు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మల్లాది విష్ణు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించామన్నారు. అయితే అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సమావేశాలు కుదించే యోచనలో ఉందన్నారు. ముందుగా ఈ విషయాన్ని పసిగట్టిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం రేపే పెట్టేందుకు సిద్ధమైందన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే ఈ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైనట్లు చెప్పారు. ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిందన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని మా పార్టీ అధినేత వైయస్‌జగన్‌ టీడీపీని బహిరంగంగా కోరారన్నారు. అయితే టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే విషయంలో వెనుకడుగు  వేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనసాగేందుకు 271 సంఖ్య బలం ఉండాలన్నారు. ఇప్పుడు కేంద్రానికి కేవలం 272 ఎంపీలు మాత్రమే ఉన్నారని, అన్ని  పార్టీలు మద్దతిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే అవకాశం ఉందన్నారు. 
 
Back to Top