ఓటుకు కోట్లు అంశంపై వైఎస్సార్సీపీ చర్చకు పట్టు..

కుంటి సాకులు చూపిన తెలుగుదేశం

హైద‌రాబాద్‌: ఐదురోజు అసెంబ్లీ సమావేశాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఓటుకు నోటు అంశంపై సభ అట్టుడికింది.  ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబునాయుడు పేరు ప్రస్తావిస్తూ వైఎస్సార్పీసీ వాయిదా తీర్మానం ఇచ్చింది.  ఐతే, ఈఅంశం నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ సభ్యులు కుంటిసాకులు చెబుతూ సభను పక్కదోవ పట్టించారు. చంద్రబాబు తమ అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందోనని ప్లానుడ్ గా తప్పించుకున్నారు. సభలో ప్రతిపక్షం ప్రజల ముందు ఎక్కడ దోషిగా నిలబెడుతుందోనని భయపడి అసెంబ్లీకి రావడమే మానేశారు .

ఓటుకు కోట్లు అంశంపై వైఎస్సార్సీపీ చర్చకు పట్టు..!
ఓటుకు నోటుపై చర్చ చేపట్టాల్సిందేనంటూ వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం వద్ద  ఆందోళన చేపట్టారు.  చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారపార్టీ సభ్యులు మరోసారి బరితెగించారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. 

పట్టువదలని ప్రతిపక్షం... బిత్తరపోయిన అధికారపక్షం..!
తిరిగి ప్రారంభమైన అనంతరం ప్రతిపక్షసభ్యులు చర్చకు గట్టిగా పట్టుబట్టారు. ఓటుకు కోట్లపై చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు పచ్చనేతలు మరోసారి ప్రతిపక్షనేతపై వ్యక్తిగత దూషణలకు దిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా పచ్చనేతలు పదే పదే అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ మరోసారి సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.  
Back to Top