వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్ల స‌స్పెన్ష‌న్‌


 
మున్సిపల్‌ హాల్‌లో చంద్రబాబు చిత్రపటం 
వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిల్‌ సభ్యులు అభ్యంతరం..
విజయవాడః మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో చంద్రబాబు చిత్రపటం ఉండటంపై వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిల్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.అంబేద్కర్‌ చిత్రపటం పక్కన  చంద్రబాబు నాయుడు ఫొటో పెట్టడం తప్పుబట్టారు. ముందు   వైయస్‌ఆర్‌ చిత్రపటం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచి ప్రజలకు బాసటగా నిలిచిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన చిత్రపటం  పెట్టాలన్నారు. దీంతోఓ అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లను మేయర్‌ సస్పెండ్‌ చేశారు. విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని పెడితే పుష్కరాల పేరుతో టీడీపీ ప్రభుత్వం తొలగించిందని మున్సిపల్‌ కౌన్సిల్‌ విపక్ష నాయకురాలు పుణ్యశీల ఆగ్రహం వ్యక్తం చేశారు.కౌన్సిల్‌లో సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఫొటోలు పెడుతున్నారని మండిపడ్డారు.
 
Back to Top