జూన్‌ 1న వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమావేశం

నూజివీడు: జూన్‌ ఒకటోతేదీన వైయస్సార్‌సీపీ నూజివీడు నియోజకవర్గ సమావేశంను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు తెలిపారు. పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 2గంటల నుంచి నిర్వహించనున్న నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిధులుగా రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, రక్షణనిధి తదితర నేతలంతా రానున్నారన్నారు. రాబోయే రెండేళ్లల్లో పార్టీనాయకులు, కార్యకర్తలు పార్టీ ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే విషయమై ఈ సమావేశంలో ప్రసంగించడం జరుగుతుందన్నారు. పార్టీనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు అందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే విజ్ఞప్తిచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top