బడ్జెట్‌లో అంకెలకు విశ్వసనీయత ఉందా?

–కమీషన్లు, లంచాలకు అవకాశం ఉన్న శాఖలకే కేటాయింపులు
– ఏ ప్రతిపాదికన కేంద్రం నిధులు ఇస్తుందో చెప్పాలి
– చంద్రబాబువి అన్నీ దొంగ లెక్కలే
వైయస్‌ జగన్‌ను విమర్శించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు 

విజయవాడ: రాష్ట్ర బడ్జెట్‌లో అంకెలకు విశ్వసనీయత ఉందా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు మండిపడ్డారు. బడ్జెట్‌ కేటాయింపులపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. నీటి వనరుల శాఖ కేటాయింపులు ఆశ్చర్యకంగా ఉన్నాయని, ఎవరిని మోసం చేసేందుకు ఇలాంటి కేటాయింపులు చేశారని మండిపడ్డారు. వ్యవసాయ రుణాలపై ప్రభుత్వం చాలా పెద్దగా చెప్పిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటున్నారని, ఇంటికో రుణం ఇస్తామని, అన్ని రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి..అధికారంలోకి వచ్చాక నిబంధనల పేరుతో రుణాలు కుదించి రుణమాఫీ కోసం రూ.400 కోట్లు మాత్రమే చివరి బడ్జెట్లో కేటాయించారన్నారు. వ్యవసాయ రుణాల బకాయిలు చెల్లించకుండా రైతులకు ఎగనామం పెట్టారన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి గత బడ్జెట్లో రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఈ సారి వెయ్యి కోట్లు అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 46 నెలలు అవుతుందని,ప్రతి ఇంటికి రూ.96 వేలు ఈ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. ఈ బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం అరకొరనే అన్నారు.  రూ.84 వేల కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయని చెబుతున్నారని, ఏ ప్రతిపాదికన వస్తున్నాయో లెక్కలు చెప్పాలన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయంతో అప్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రోజు బడ్జెట్‌లో రూ.33 వేల కోట్లు అప్పులు చూపిస్తున్నారని వివరించారు. తలసరి ఆదాయం 1.54 లక్షలు అని చెబుతున్నారు. ఈ ప్రభుత్వ లెక్కలు గమనిస్తే ఆంధ్ర ప్రజలు శ్రీమంతులు అని అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వ హయాంలో సంతోషంగా లేరన్నారు. ఇప్పటి వరకు పోలవరానికి ఎంత కేటాయించాలో చెప్పాలని పట్టుబట్టారు. నాలుగేళ్లుగా పోలవరానికి ఖర్చు చేసింది రూ.7 వేల కోట్లు మాత్రమే అన్నారు. ఇలా అయితే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్నారు. లేని గొప్పలకు పోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టుతుందన్నారు. స్థులంగా ఈ బడ్జెట్‌ అంకెల గారడీ అని అభివర్ణించారు. కమీషన్లు, లంచాలకు అవకాశం ఉన్న శాఖలకే నిధులు కేటాయించారని విమర్శించారు.  కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో టీడీపీ విఫలమైందని మండిపడ్డారు. కేవలం మీడియా మ్యానేజ్‌ కోసం టీడీపీ ప్రయత్నలు చేస్తుంది తప్ప..ఏ వర్గానికి ఈ బడ్జెట్‌లో మేలు జరగలేదని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు జరిగిన కేటాయింపుల్లో ఎక్కడ పొంతన లేదన్నారు.
Back to Top