వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు

విశాఖః దివంగత
ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనయ, ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల జన్మదిన వేడుకలను వైఎస్సార్సీపీ
శ్రేణులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు. ఈసందర్భంగా వైఎస్
షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేశారు.  విశాఖలో మహిళలు కేక్
కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. 

ప్రపంచంలోనే
ఏమహిళ చేయలేని సాహసాన్ని వైఎస్ షర్మిల చేశారని ఈసందర్భంగా వారు గుర్తు
చేసుకున్నారు.  ప్రజలకు, అధిష్టానానికి మధ్య వారధిగా 3 వేల కి.మీ. పాదయాత్ర
చేసి ప్రజాసమస్యల్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చి పార్టీ పటిష్టతకు
కృషి చేశారన్నారు. అనేక రకాలుగా పార్టీని బలోపేతం చేస్తున్న సోదరి
షర్మిల..ఇలాంటి మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మహిళలు
ఆకాంక్షించారు.  ఆమె బాటలో నడుస్తూ  పార్టీ పటిష్టత కోసం కృషిచేస్తామని
తెలిపారు. 
Back to Top