దాహార్తిని తీరుస్తున్న వైయ‌స్సార్ ట్రస్టు

గుత్తి: ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇటు అధికారులు కాని అటు ప్రజా ప్రతినిధులు ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వైయ‌స్ఆర్ చారిట‌బుల్ ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కులు మాళ్ల జీవానంద‌రెడ్డి ముందుకువ‌చ్చారు.  తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో విరివిరిగా అవసరం ఉన్న మేరకు ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో జీవానంద‌రెడ్డి చ‌లివేంద్రాలు ఏర్పాటు చేశారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే 25 చలివేంద్రాలు ఏర్పాటు చేయించాడు. ఇందులో గుత్తిలో ఐదు , పెద్దవడుగూరులో ఐదు, పామిడిలో 12, యాడికిలో నాలుగు చొప్పున మొత్తం 25 చలివేంద్రాలు ఏర్పాటు చేయించాడు. వేసవి కాలంలో అదీ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తరుణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రజలందరూ వైయ‌స్ఆర్ ట్ర‌స్టును అభినందిస్తున్నారు. మండుటెండ‌లో ప్ర‌జ‌ల గొంతు త‌డుపుతున్న వైయ‌స్ఆర్ ట్ర‌స్టు సేవ‌ల‌ను ప్ర‌జ‌లంతా కొనియాడుతున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top