మళ్లీ వైఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారు..

హైదరాబాద్ :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం 12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కార్యాలయంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ యూజర్, కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారన్నారు.


చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మండుటెండల్లో వైఎస్ఆర్ పాదయాత్ర చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాదయాత్ర వల్ల ప్రజల్లో ఉపశమనం వచ్చిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ దేశంలో ఎవరూ చేయనంత విధంగా ప్రజలకు సుపరిపాలన ఇచ్చారన్నారు. ప్రజలందరికీ గూడు ఉండాలని 47 లక్షల ఇళ్లు కట్టించారన్నారు. 78లక్షల మంది పేదలకు పింఛన్లు ఇచ్చిన ఘటన ది ఆయన పేర్కొన్నారు.

ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, అలాగే పేదవాడికి అనారోగ్యం అయితే చికిత్స చేయించుకునేందుకు అప్పులు పాలవకుండా ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అందుకే వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని వైఎస్ జగన్ అన్నారు. అటువంటి పాలన మళ్లీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, అందుకోసం అందరం కలిసి అడుగు వేయాలని వైఎస్ జనగ్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top