న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం సాధ్యం

నగరం (మంగ‌ళ‌గిరి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం సాధ్య‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు.  రేపల్లె నియోజకవర్గంలోని నగరంలో నవరత్నాల ప్రచారంలో భాగంగా వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని బుధవారం మోపిదేవి ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతికుటుంబాన్ని వైయ‌స్ఆర్ కుటుంబసభ్యులుగా చేర్చేవిధంగా బూత్‌ కమిటీ సభ్యులు కృషిచేయాలన్నారు. బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరిగి 9121091210 మిస్డ్‌కాల్‌ ఇచ్చి వారిని  వైయ‌స్ఆర్ కుటుంబసభ్యులుగా చేర్చాలన్నారు. నవరత్నాల కరపత్రంతో పాటు చంద్రబాబు పాలనపై వందప్రశ్నలకు వారితోనే మార్కులు వేయించాలన్నారు. బూత్‌కమిటీ సభ్యులు బూత్‌ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలసుకుని టీడీపీ అరాచకపాలన గురించి వివరించాలన్నారు. ప్రతిఇంటికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి స్టిక్కర్‌ను అతికించాలన్నారు. మహనేత రాజన్న పాలనలో అమలైన ప్రజారంజక సంక్షమపథకాలను ప్రజలకు గుర్తుచేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి తిరుగుతున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.తొలుత నగరం సెంటర్‌లోని డాక్టర్  వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి మోపిదేవి, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరం మెయిన్‌సెంటర్‌లో వైయ‌స్ఆర్‌ కుటుంబ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నవరత్నాలు, చంద్రబాబు పాలనపై వందప్రశ్నల కరపత్రాలను పంపిణీచేసి ప్రజల చేత మార్కులు వేయించారు.

తాజా ఫోటోలు

Back to Top