తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రెస్ బైక్ ర్యాలీ

తిరుపతి 07 ఆగస్టు 2013:

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో ఉద్యమాలు జోరుగా సాగుతున్నాయి. తిరుపతిలో బుధవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి దీనికి నాయకత్వం వహించారు. చంద్రబాబునాయుడి నీచ రాజకీయాల వ్లనే కా రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని భూమన మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలను ప్రజలు గుర్తించారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు తమకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఉన్నత స్థాయి కమిటీపై ప్రజలకు నమ్మకం లేదని స్పష్టంచేశారు అదంతా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న కుట్రని విమర్శించారు.

మరోవైపు సమైక్యాంధ్ర ఆందోళనలతో పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఏలూరులో ఆర్టీఏ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ వరకు ఆటోమోబైల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

Back to Top