వైయస్ఆర్ కాంగ్రెస్ 'ఉత్తరాఖండ్' నిధి

బాన్సువాడ 24 జూన్ 2013:

ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తునట్టు ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఈ నిధికి తగిన సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్ వరదలలో వేల సంఖ్యలో మరణించినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగానికి చెందిన వారు ఆ ప్రాంతంలో బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

Back to Top