బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ త‌గ‌దు: వైఎస్ జ‌గ‌న్

హైద‌రాబాద్‌: రాజ‌ధాని కోసం బ‌ల‌వంతంగా భూముల్ని సేక‌రించ‌టం త‌గ‌ని ప‌ని అని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఈ మేర‌కు సామాజిక వెబ్ సైట్ ట్విట‌ర్ లో ఆయ‌న ట్వీట్ చేశారు నిస్స‌హాయులైన రైతుల నుంచి ప్ర‌భుత్వం  బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌టాన్ని తాము గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వాస్త‌వానికి రాజ‌ధాని పేరుతో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి, తుళ్లూరు, అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు లాక్కోవ‌టం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచీ రైతుల ప‌క్షాన నిల‌బ‌డి పోరాడింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే. ఈ ప్రాంతంలో రాజ‌ధాని పెట్టేందుకు తాము వ్య‌తిరేకం కాద‌ని, కానీ బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌టం త‌గ‌ని పని అని పార్టీ వాదిస్తూ వ‌చ్చింది. శుక్ర‌వారం నాడు మొద‌ట‌గా భూ స‌మీక‌ర‌ణ కు నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌రుణంలో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఈ చ‌ర్యను వ్య‌తిరేకించారు. ప్ర‌జ‌ల చేత ఎన్నికైన ప్ర‌భుత్వం నిరుపేద‌ల నుంచి భూముల్ని లాక్కోవ‌టం సిగ్గుచేటు అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top