తెలుగు ఇంజనీర్‌ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

హైద‌రాబాద్‌:  అమెరికాలో జ‌రిపిన కాల్పుల ఘ‌ట‌న‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతికి గుర‌య్యారు. కాల్పుల్లో మృతి చెందిన తెలుగు ఇంజ‌నీర్ శ్రీ‌నివాస్ కు వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం తెలిపారు. అమెరికా దేశంలోని కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో శ్రీ‌నివాస్ మృతి చెంద‌గా, అలోక్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్‌ అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, తెలుగు ప్ర‌జ‌ల‌కు అమెరికాలో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

Back to Top