వైయస్‌ అవినాష్‌రెడ్డి అరెస్ట్ : ‌పులివెందులలో ఉద్రిక్తత

పులివెందుల (వైయస్‌ఆర్‌ కడప జిల్లా), 31 ఆగస్టు 2012 : విద్యుత్ కోతలకు నిరసనగా శాంతియుతంగా బంద్ పాటిస్తున్న వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరె‌స్టులు చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బం‌ద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. వైయస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందులలో ప్రశాంతంగా బంద్‌ నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం కన్వీనర్ వైయస్‌ అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, పోలీసుస్టేషన్‌కు తరలించారు. అవినాష్‌రెడ్డిపై పోలీసులు జులుం ప్రదర్శించారు.బంద్‌లో పాల్గొన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను ఈడ్చుకెళ్ళి, పోలీసు వాహనాల్లో పడేశారు. పులివెందులలో అదనపు బలగాలు మోహరించి, భయోత్పాతం సృష్టించారు. పోలీసుల చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి ఈసందర్భంగా డీఎస్పీని ప్రశ్నించారు.

కాగా, అవినాష్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా వేలాది మంది పార్టీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. దీనితో పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పులివెందులలో ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం ముందస్తుగా పక్కా వ్యూహం పన్నినట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రశాంతంగా బంద్‌ నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, నిర్బంధిస్తున్నారని పార్టీ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top