ఆమ‌ర‌ణ దీక్ష‌కు వైయ‌స్‌ జగన్‌ సంఘీభావం

గుంటూరు:  ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరహార దీక్షకు దిగిన వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీల దీక్ష‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో కలసి ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. అలాగే  రాష్ట్ర‌వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు.వైయ‌స్ఆర్‌సీపీ  శ్రేణులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థులు యువకులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలుచోట్ల బైక్‌ర్యాలీలు నిర్వహించగా.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక హోదా కోసం పూజలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top