గుంటూరుః ప్రత్యేకహోదా సాధనకోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఓమైలురాయిలా నిలుస్తోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ధ్యేయంగా వైఎస్ జగన్ చేపట్టిన ఉద్యమం 100 గంటలు పూర్తిచేసుకొని మున్ముందుకు సాగుతోంది. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 2.15 గం. వైఎస్ జగన్ గుంటూరు నల్లపాడురోడ్డులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆనాటి నుండి నేటి సాయంత్రం 6.15 గం. వరకు వైఎస్ జగన్ దీక్ష చేపట్టి వంద గంటలు దాటిపోయింది. <br/>ఐదురోజుల పాటు మొక్కవోని దీక్షతో వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున దీక్షాస్థలికి తరలివచ్చి వైఎస్ జగన్ కు మద్దతు తెలుపుతున్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా చెరగని చిరునవ్వుతో ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వైఎస్ జగన్ అభివాదం చేస్తున్న తీరు రాష్ట్రప్రజానీకాన్ని అమితంగా ఆకట్టుకుంటోంది.