గుంటూరు వేదికగా యువభేరి

  • చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
  • హోదాపై యువతకు వైయస్ జగన్ దిశానిర్దేశం
గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం గుంటూరులో ఈనెల 16వ తేదీన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న త‌ల‌పెట్టిన‌ యువభేరి కార్యక్రమానికి  ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుంటూరు- నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కనున్న స్థలాన్నే యువభేరికి వేదికగా ఎంపిక చేశారు. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. ఏర్పాట్లపై బుధ‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు స‌మీక్షించారు. విద్యార్థులు, మేధావులు,యువకులను చైతన్యపరిచి పెద్ద ఎత్తున యువభేరికి తరలిరానున్నారు.    

హోదా కోసం వైయ‌స్ జ‌గ‌న్ అలుపెర‌గ‌ని పోరాటం
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయకులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రత్యేకహోదా సాధనకు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ఇదివ‌ర‌కే ఆమరణ దీక్ష చేసిన ఆయ‌న యువ‌భేరి సదస్సులతో యువ‌త‌, విద్యార్థుల‌ను చైత‌న్య‌వంతం చేసేందుకు ద‌శ‌ల‌వారిగా ఉద్య‌మిస్తున్నారు. ఒకవైపు ప్ర‌జా స‌మస్య‌ల‌పై పోరాడుతునే..మ‌రోవైపు విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల సాధ‌న‌కు ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తెస్తున్నారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ వివిధ సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏవిధంగా ఒత్తిడి తెచ్చింది.  అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో ఏ పాత్ర పోషించిందో.. ఏవిధంగా శల్య సారథ్యం వహించిందో అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెడితే మాకు అక్కరలేదంటూ లోక్ సభ, రాజ్యసభలో హోదాకు వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేసింది. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. ప్యాకేజీ వస్తే చాలు. రాజకీయ స్వార్థంతో బీజేపీ, టీడీపీ ప్రత్యేక హోదాకు తూట్లు పొడుస్తున్నాయి. ఈ క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హిస్తున్న‌  యువభేరి సదస్సుకు విద్యార్థులు, యువత, పెద్దలు, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని  పార్టీ నాయ‌కులు పిలుపునిచ్చారు.  
Back to Top