వైయస్ జగన్ అభినందనలు

హైదరాబాద్ః భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అభినందించారు. ఖేల్ రత్న అవార్డుకు సింధు అర్హురాలని, భవిష్యత్తులో యువ క్రీడాకారులకు తను స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. సింధుతో పాటు సాక్షిమాలిక్, దీపాకర్మాకర్, జీతూ రాయ్ లకు ఖేల్ రత్న దక్కడం పట్ల వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్ చంద్ అవార్డులకు ఎంపీకైన క్రీడాకారులను కూడా వైయస్ జగన్ ఈసందర్భంగా అభినందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top