ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

శ్రీహరికోట :  జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్ ప్రయోగం సక్సెస్ పై వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. సైంటిస్టుల కృషిని ఆయన కొనియాడారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించారు. దీనికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top