నా పట్ల ప్రజల నమ్మకం మరింత స్ఫూర్తిదాయకం..

విజయనగరంః పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయి దాటడం సంతోషకరమని వైయస్‌ జగన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రజలతో కలిసి చేసిన ఈ పాదయాత్ర ద్వారా అత్యున్నతమైన అనుభవాలు సంపాదించుకున్నానని తెలిపారు. ప్రజల చూపించిన ప్రేమ, నా పట్ల ఉంచిన నమ్మకం మరింత ముందుకు వెళ్లడానికి నాకు స్ఫూర్తిదాయకమన్నారు.

ప్రజాసంకల్పయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం పట్ల  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాభిమానం దన్నుతో పాదయాత్రలో చారిత్రక ఘట్టాన్ని లిఖించినందుకు హర్షం ప్రకటించారు. తన ఆనందాన్ని ట్విటర్‌ ద్వారా వ్యక్త పరిచారు. ‘ఈరోజు మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో కలిసి పాదయాత్ర చేయడం గొప్ప అనుభూతి. నా మీద మీరు చూపించిన ప్రేమ, విశ్వాసం ప్రతిరోజు ప్రేరణ’గా నిలుస్తుందని వైఎస్‌ జగన్ ట్వీట్‌ చేశారు. కాగా, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని జననేత దాటారు.


Back to Top