<br/><br/>విజయవాడ: రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టిన ఆధారాలు చూస్తే..బీసీల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుందని వైయస్ జగన్ పేర్కొన్నారు. వైయస్ జగన్ గురువారం జడ్జిల నియామకంలో చంద్రబాబు అడ్డుపడటాన్ని ట్విట్టర్ ద్వారా స్పందించారు. చంద్రబాబు నోరు తెరిస్తే బీసీల సంక్షేమ అంటారు. మరి బీసీ లాయర్లు జడ్జిలు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బీసీ జడ్డిల నియమకాల్ని అడ్డుకునేలా తప్పుడు ఫీడ్‌బ్యాక్ ఎందుకు ఇచ్చారని వైయస్ జగన్ నిలదీశారు.