నెల్లూరు జిల్లా పర్యటన

నెల్లూరుః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆగష్టు 1 నుంచి 3వ తేదీ వరకు జననేత జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 1,2 తేదీలలో వైయస్ జగన్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. 3వ తేదీ నెల్లూరులో జరిగే యువభేరీ కార్యక్రమానికి వైయస్ జగన్  ముఖ్య అతిథిగా హాజరవుతారని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్థన్ రెడ్డి,  ప్రోగామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.  అధ్యక్షులు జిల్లాకు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈసమావేశంలో కాకాని, రఘురాంతో పాటు ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.Back to Top