వైయస్ జగన్ పర్యటన రద్దు

తూర్పుగోదావరి(వీఆర్ పురం) : రాష్ట్ర విభజనతో జిల్లాలో విలీనమైన నాలుగు మండలాల్లో గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూలై రెండున ఆ మండలాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించ తలపెట్టిన  పర్యటన  రద్దు అయినట్లు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్(బాబు)  ఒక ప్రకటనలో తెలిపారు.
 
ప్రకృతి సహకరించకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వైయస్ జగన్ పర్యటన రద్దయిందని వివరించారు. జూలై 2న రేఖపల్లి సభకు వైయస్ జగన్ వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న  కార్యకర్తలు, అభిమానులు నిరుత్సాహ పడాల్సిన పని లేదని,  జూలైలోనే విలీనమండలాల్లో ఆయన పర్యటన జరుగుతుందని చెప్పారు. త్వరలో తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Back to Top