పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్ ఆత్మీయ ప‌ర్య‌ట‌న‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మూడు రోజుల పాటు పులివెందుల నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఎక్క‌డికి వెళ్లినా జ‌నం ఆయ‌న వెన్నంటి ఉన్నారు. మొద‌టి రోజు స్థానిక నియోజ‌క వ‌ర్గ నేత భాస్క‌ర్ రెడ్డిని ప‌లక‌రించారు. త‌ర్వాత ఇందిరాగాంధీ ప‌శు ప‌రిశోద‌న కేంద్రాన్ని సంద‌ర్శించారు. త‌ర్వాత రోజు ఒంటిమిట్ట రామాల‌యాన్ని సంద‌ర్శించి, క‌మలాపురం ద‌ర్గా నుం సంద‌ర్శించి ప్రార్థ‌న‌లు చేశారు ఉరుసు ఉత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎక్కడ చూసినా గ్రామాల వద్ద ఆపుతూ జనం వైఎస్ జగన్‌కు హారతులు పట్టారు. పెద్ద ఎత్తున‌ కార్యకర్తలు వచ్చి కాన్వాయ్‌ని ఆపి వైఎస్ జగన్‌ను పలకరించారు. బాకరాపేట వద్ద, ఒంటిమిట్ట, ఇర్కాన్ సర్కిల్, వల్లూరు, రైల్వే గేటు, కమలాపురం బ్రిడ్జి, నాలుగు రోడ్ల సర్కిల్ ఇలా ఎక్కడ చూసినా జగన్ కాన్వాయ్‌ని ఆపి జనాలు ప్రతిపక్షనేతను కలిశారు.  లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద  పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. 
Back to Top