అరుణ్ జైట్లీని కలిసిన వైఎస్ జగన్ బృందం

న్యూఢిల్లీః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పార్టీనేతలు ఢిల్లీలో బాబు అప్రజాస్వామిక విధానాలపై ఉద్యమిస్తున్నారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు అరాచక క్రీడల్ని జాతీయ స్థాయిలో ఎండగడుతున్నారు. సేవ్ డెమొక్రసీ నినాదంతో పోరాటం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే  నిన్న వివిధ జాతీయ పార్టీ నాయకులను, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన వైఎస్ జగన్ బృందం..ఇవాళ మరో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలుసుకుంది. పార్టీ ఫిరాయింపుల్ని, చంద్రబాబు అవినీతిని  వైఎస్ జగన్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. రెండేళ్లలోనే చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన వైనాన్ని వివరించారు. దీనిలో భాగంగా  బాబు అవినీతిపై రూపొందించిన చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తక కాపీని వైఎస్ జగన్ జైట్లీకి అందించారు.

తాజా వీడియోలు

Back to Top