ఉద్ధానం కిడ్నీ బాధితులకు జననేత బాసట

  • జగతి గ్రామంలో బాధితుల గోడు విన్న ప్రతిపక్ష నేత 
  • డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం మాట తప్పిందని ఫిర్యాదు
  • బాధితులను అక్కున చేర్చుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళుం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ బాధితులను పరామర్శించారు. జిల్లాలో వైయస్‌ జగన్‌ రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం కవిటి మండలం జగతి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలను ఆయన పలకరించారు. వ్యాధి తీవ్రతపై ఆరా తీశారు. ఒక్కో బాధితుడితో ముఖాముఖిగా మాట్లాడి వారికి ధైర్యం చెబుతున్నారు. బాధితులు తమ బాధలు ప్రతిపక్ష నేతకు చెప్పుకొంటున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రాంతంగా అంతర్జాతీయ స్థాయిలో ఉద్ధానం ప్రాంతం మూడో స్థానంలో ఉందని 1983లోనే గుర్తించారు. కానీ ఏ పరిశోధన ఫలితం కూడా ఇక్కడ ఉన్న వ్యాధి తీవ్రతను తగ్గించలేకపోతున్నారు. వ్యాధి బారిన పడుతున్న వారికి చికిత్స చేయడం, రక్త నమూనాలు సేకరించడం, చనిపోయే వరకు డయాలసిస్‌ అందించడం తప్ప..ప్రభుత్వాలు వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. పేద కుటుంబాలు డయాలసిస్‌ చేయించుకునే ఆర్థిక స్థోమత లేక అకాల మరణాలు పొందుతున్నారు. నిపుణులైన వైద్యులను పంపించడం, వైద్యసేవలు మెరగుపరచడంలో ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లో రక్తనమూనాలు పరీక్షించేందుకు ల్యాబోరేటరీలు లేవని బాధితులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉన్న ఆస్తులు,భూములు అమ్ముకొని చికిత్సలు పొందుతున్నామని బాధితులు వాపోయారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడని ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు రూ.15 నుంచి 20 వేల వరకు డయాలసిస్‌కు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. 60 రోజుల్లో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కనిపించకుండా పోయాడని, డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని ఉద్ధానం ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఒక్కొక్క బాధితుడిని కలిసి వారి బాధలు  అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరికి ఒకరకమైన బాధ చెప్పుకోవడంతో వైయస్‌ జగన్‌ చలించిపోయారు. త్వరలోనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అందరికి మంచి జరుగుతుందని భరోసా కల్పించారు. నేనున్నాను..మీరెవ్వరు బాధపడవద్దని ధైర్యం చెప్పారు. మనోనిర్భరంతో ఉండండి, ఈ రోగాన్ని మనం జయిద్దామని హామీ ఇచ్చారు.
Back to Top