నడిచేది నేనైనా..న‌డిపిస్తున్న‌ది మీ అభిమానమే..!



– పోలవరం పూర్తయితేనే రైవాడకు నీళ్లు
– వ్యవసాయం గోవిందా..వర్షాలు గోవిందా
– పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటలేదు
–పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు దాటడం సంతోషకరం
– పోలవరంపై చంద్రబాబు ప్రతీసారీ ఓ డ్రామా
– ఏపీలో రైతుల గురించి అమెరికాలో చెప్పే ధైర్యముందా బాబూ?
– రైతుల ఆదాయం మన రాష్ట్రంలో 29వ స్థానంలో ఉంది
– గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా 
– ఇంటికో ఉద్యోగం..నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు
– ఆరోగ్యశ్రీ అటకెక్కింది
– మంత్రికి పంటి నొప్పి వస్తే మాత్రం సింగపూర్‌ వెళతారు
– పింఛన్‌ కావాలంటే ఏ పార్టీ మీది అని అడుగుతున్నారు
– తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు
– వైయస్‌ఆర్‌ హయాంలో అన్నీ వచ్చాయి 
– చేతికి ఉంగరం లేదు..గడియారం లేదు..మెడలో గొలుసు లేదంటారు చంద్రబాబు
– తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు కోట్లకు కోట్లు వస్తాయి
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనేందుకు కోట్లు వస్తాయి

విజయనగరం:  ప్రజా సంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయి దాటడం సంతోషంగా ఉందని, నడిచేది నేనైనా..నడిపించింది మీ అభిమానమే అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో కలిసి చేసిన ఈ పాదయాత్ర ద్వారా అత్యున్నతమైన అనుభవాలను సంపాదించుకున్నానని చెప్పారు. ప్రజలు చూపిన ప్రేమ, నా పట్ల ఉంచిన నమ్మకం మరింత ముందుకు వెళ్లడానికి నాకు స్ఫూర్తిదాయకమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగిందని చెప్పారు. చంద్రబాబు పాలనను బంగాళఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కొత్త వలస పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

– ఈ రోజు ఉపన్యాసం మొదలుపెట్టే ముందు..అరకు ఎమ్మెల్యే ఒక దుర్ఘటనలో మృతి చెందడం తెలిసిందే. ఆ ఎమ్మెల్యే మన పార్టీని విడిచి వెళ్లి మనల్ని మోసం చేసినా..తనకు జరిగిన దుర్ఘటన బాధనిపించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రసంగం మొదలుపెడుతున్నాను.
– 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఎక్కడ ఇడుపులపాయ..ఎక్కడ కొత్త వలస అనిపిస్తోంది. నిజంగా 3 వేల కిలోమీటర్లు నడువగలవా అని ఎవరైనా అడిగితే నా ముఖంలో చిరునవ్వు ఉండేది. కానీ ఇవాళ కచ్చితంగా ఒకటి చెబుతున్నాను. నిజంగానే పైన దేవుడు ఉన్నాడు..కింద అభిమానించే ప్రజలు ఉన్నారు. మీరు చూపించిన అప్యాయతల వల్లే నడిచాను. నడిచేది నేనైనా..నడిపించింది మీ అభిమానమే. 
– ఇవాళ ఇక్కడి ప్రజలు ఇక్కడి సమస్యలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడి ప్రజలు నాతో అన్న మాట..అన్నా..ఈ నియోజకవర్గం ఎస్‌.కోట నియోజకవర్గంలో టీడీపీ పుట్టిన తరువాత 2004 తప్పు మొదటి నుంచి 30 ఏళ్లగా టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ వస్తున్నామన్నా..ఈ నియోజకవర్గంలో గుర్తుపెట్టుకునే మూడు పనులు కూడా టీడీపీ చేయలేదని చెబుతున్నారు. ఇదే నియోజకవర్గంలోని ఎల్‌.కోట, కొత్త వలస, వేపాడు మండలాలు నిరంతరం కరువు మండలాలు. రైవాడ రిజర్వాయర్‌ ఉన్నా..నీళ్లు విశాఖ అవసరాలకు తరలిస్తూ  ఇక్కడి రైతులకు నిరాశ మిగిలిస్తున్నారు. తాటిపూడి రిజర్వాయర్‌ పరిస్థితి అంతే. ఇక్కడి రైతులకు మేలు జరగాలంటే రైవాడ నీరు రావాలంటే..పోలవరం పూర్తి కావాలి. కానీ నాలుగున్నరేళ్లుగా పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. నాన్నగారి పాలనలో పోలవరం పనులు పరుగులు తీశాయి. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందని, గోదావరి నీళ్లు విశాఖకు ఎప్పుడు చేరుతాయి, రైవాడ నీటిని ఎప్పుడు వాడుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు. అయినా ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకనే సాగుతున్నాయి. పోలవరం విషయంలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. అందులో భాగంగా చంద్రబాబు తన ఫ్యామిలీని పిక్నిక్‌కు తీసుకెళ్లారు. అక్కడ పునాది గోడలు కూడా ముందుకు సాగడం లేదు. డిౖజñ న్లు కూడా పూర్తి కాలేదు. చంద్రబాబు పనుల్లో రేట్లు పెంచి ఆ కాంట్రాక్ట్‌ పనులను సబ్‌ కాంట్రాక్టులకు అప్పగించి కమీషన్లు దోచుకుంటున్నారు. చంద్రబాబు అవినీతి వల్ల ఆ ప్రాజెక్టు నత్తనడకన సాగుతున్నాయి.
– చంద్రబాబు ఎప్పుడు వచ్చినా సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. భీమ్‌సింగ్‌ చక్కెర ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేసే పరిశ్రమ..గతంలో కూడా ఈ ప్రాజెక్టు మూతపడే దశకు చేరితే దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టును ఆదుకున్నారు. నాన్నగారు పాదయాత్రలో  ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టును తెరిపించాలని కోరితే..వైయస్‌ఆర్‌ గుర్తు పెట్టుకొని మరీ ఇక్కడికి వచ్చి మళ్లీ తెరిపించారని చెబుతున్నారు. ఇదే ప్రాజెక్టు మళ్లీ చంద్రబాబు పాలనలో రూ.43 కోట్ల అప్పులతో మునిగిపోయే పరిస్థితిలో ఉంది. అన్నా..చంద్రబాబు హయాంలో ఆయన అడుగు పెడితే చాలు ఏది బతకదు అని చెబుతున్నారు. 
–ఇదే ప్రాంతంలో చక్కటి రైల్వే వ్యవస్థ ఉంది. అయినా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి ముందుకు పడటం లేదు. నాన్నగారి హయంలో ఇదే నియోజకవర్గంలో శారదా స్టీల్, గోల్డుస్టార్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలో నాలుగు వేల మందికి ఉపాధి వచ్చిందని చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా రాలేదని చెబుతున్నారు.
– చంద్రబాబు పాలనలో  కొత్త ఫ్యాక్టరీల కథ దేవుడెరుగు..ఉన్న జ్యూట్‌ మిల్లు ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత విఫరీతంగా కరెంటు బిల్లులు పెంచిన పుణ్యానా జ్యూట్‌ మిల్లులు మూతపడుతున్నాయని చెబుతున్నారు. 
– ఇదే చంద్రబాబు ఇదే నియోజకవర్గంలో మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు. కొత్త వలసలో 30 పడకల ఆసుపత్రి, డిగ్రి కాలేజీ కడుతామని 30 ఏళ్లుగా చెబుతున్నారు. ఇంతవరకు ఒక్క పని చేయలేదు. సొంత జూనియర్‌ కాలేజీ స్థానిక ఎమ్మెల్యేకు ఉంది కాబట్టి..ఎల్‌. కోటలో జూనియర్‌ కాలేజీ రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారు.
– ఐదు మండలాలకు చెందిన రైతులు కూరగాయాలు అమ్ముకునేందుకు మార్కెట్‌ లేదు. కనీసం రైతు బజారు కూడా నిర్మించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రాంతం మామిడితాండ్రకు ప్రసిద్ధి..ఈ మామిడి తాండ్రను నిల్వ చేసుకునేందుకు కోల్డు స్టోరేజీ ఏర్పాటు చేయడం లేదు. ఈ పాలనను నిజంగా బంగాళఖాతంలో కలపాలా? వద్దా?
– ఎస్‌.కోట–ఆనందపురం వరకు ఉన్న రోడ్డు అధ్వాన్నంగా మారింది. నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు రోడ్డును మరిచిపోయారు. 
– ఈ నియోజకవర్గంలో వీళ్లు చేసింది ఏంటంటే..అవినీతి..అవినీతి..అవినీతి ఒక్కటే కనిపిస్తుంది. ఇక్కడ రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ వేయాలంటే లంచాలు కట్టాల్సిందే. నీరు–చెట్టు పేరుతో దోచుకుంటున్నారు. తాటిచెట్టు అంత లోపు చెరువులను తవ్వుతూ మట్టిని అమ్ముకుంటున్నారు. తవ్వినందుకు బిల్లులు చేసుకుంటున్నారు. నీరు–చెట్టు పేదవారికి మేలు చేసే కార్యక్రమం కాదని, టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకునే కార్యక్రమం అని చెబుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలకు, కలెక్టర్‌కు, చిన్నబాబు, పెద్దబాబుకు వాటాలు వెళ్తున్నాయని చెబుతున్నారు.
– అంగన్‌వాడీ ఉద్యోగాలు, సబ్‌ స్టేషన్‌ ఉద్యోగాలు లక్షల్లో అమ్ముకుంటున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అవినీతి అన్నది ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. 
– రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో గమనించమని కోరుతున్నాను. నాలుగున్నరేళ్లు అయిపోయింది. మారో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పేవారు..మోసాలు చేసేవారు మీకు నాయకుడు కావాలా?
– ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి, పాలన చూస్తే..చిన్న పిల్లలు ఆడుకునే ఒక ఆట గుర్తుకువస్తుంది. ఒ క బల్ల ఉంటుంది. ఆ బల్లకు ఒకవైపు ఒక పిల్లాడు, మరోవైపు ఇంకోపిల్లాడు కూర్చుంటారు. బల్లకు ఒక వైపు బరువు ఉంటే కిందకు వెళ్తుంది. బరువు తక్కువైతే పైకి లేస్తుంది. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చుంటేనే సబ్సిడీలు ఎగిరిపోతున్నాయి. నీతి, నిజాయితీ, విలువలు, ధర్మం ఎగిరిపోతోంది. చంద్రబాబు దిగిపోతే మళ్ల ఇవన్నీ కిందికి వస్తున్నాయి. చంద్రబాబు తన సొంత మామ ఎన్‌టీ రామారావును ఎన్నుపోటు పొడిచి సీఎం సీట్‌లో కూర్చున్నారు. ఆ తరువాత 9 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఆయన అధికారంలోకి రాగానే ఏం జరిగిందో ఆలోచన చేయండి. చంద్రబాబు సీఎం కాగానే బరువు దించేశారు. అప్పటి దాకా ఉన్న మద్య నిషేదం గోవిందా? రెండు రూపాయల బియ్యం గోవిందా, ప్రభుత్వ ఉద్యోగాలు గోవిందా..వ్యవసాయం గోవిందా..వర్షాలు, గిట్టుబాటు ధరలు గోవిందా..ఇⶠ్ల నిర్మాణం, రాజకీయాల్లో విలువలు గోవిందా..అన్ని గోవిందా..గోవిందా
– చంద్రబాబును సీఎం పదవి నుంచి దించిన తరువాత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వచ్చి ఆ బల్ల మీద కూర్చోగానే రైతులకు ఉచితంగా కరెంటు వచ్చింది. మొట్టమొదటి సంతకం కరెంటు బకాయిలు మాఫీ చేశారు. నాన్నగారు సీఎం అయ్యా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా దేశంతో పోటి పడి 48 లక్షల పక్కా ఇల్లు కట్టించారు. నాన్నగారు సీఎం అయ్యాక జలయజ్ఞంతో పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయించారు. రైతులకు వ్యవసాయం పండుగైంది. గిట్టుబాటు ధరలు వచ్చాయి. కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచని పాలన ఆ నాడు చూశాం. నాన్నగారు సీఎం కాగానే రూ.2 కిలో బియ్యం తెచ్చారు. పింఛన్లు వచ్చాయి. పేదలందరీకి భూ పంపిణీ జరిగింది.
– మళ్లీ  ఇవాళ చంద్రబాబు వచ్చారు. 2014లో సీఎం కుర్చీలో కూర్చున్నారు. మళ్లీ బల్ల బరువైక్కువైంది. రైతు రుణాల మాఫీ అంటూ మోసం చేశారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి తెస్తాన్న పెద్ద మనిషి వేలం వేయిస్తున్నారు. తన సొంత కంపెనీ హెరిటేజ్‌ లాభాల కోసం రైతులకు కనీస ధర రావడం లేదు. ఇవాళ వ్యవసాయం భారంగా మారింది. రైతుల అప్పులు విఫరీతంగా పెరిగాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతంలో రైతులకు వడ్డీలు లేని రుణాలు ఇచ్చేవారు. ఈయన రుణమాఫీ అని మోసం చేశారు. బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు కట్టకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి అమెరికా బయలుదేరారు. ఈయన ఓ అంతర్జాతీయ సదస్సుకు వెళ్లాడట. రైతుల గురించి అర్గానిక్‌ వ్యవసాయంపై ప్రసంగం చేస్తారట. గుంటూరు నుంచి అనంతపురం వరకు ఏడు జిల్లాల్లో పూర్తిగా కరువు నెలకొంది. మిగతా ప్రాంతాల్లో సాగునీరు అందడం లేదు. కరువు మండలాలను ప్రకటించడం లేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదు. లోన్లు రెన్యువల్‌ కావడం లేదు.  ఇటువంటి పరిస్థితిలో రైతులు ఉంటే అమెరికాలో ఆయన స్పీచ్‌ ఇస్తారట. మీ అందరి తరుఫున చంద్రబాబును అడుగుతున్నాను. ఇక్కడి రైతుల పరిస్థితి గురించి అక్కడ మైక్‌ పట్టుకుని స్పీచ్‌  ఇస్తున్నావట..ఒక్కసారి నీకు సిగ్గు..లజ్జా ఉంటే నిజాయితీగా మాట్లాడూ..
– మొన్ననే వ్యవసాయంపై నాబార్డు ఓ నివేదిక ఇచ్చింది. రైతుల ఆదాయాన్ని లెక్కేస్తే దేశంలోనే మన రాష్ట్రం చిట్ట చివరన 28వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితిని అమెరికలో చెప్పే దైర్యం ఉందా? రైతులకు ఎంత మిగులుతుందని నాబార్డు లెక్కలేస్తే..మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందని చెప్పంది. ఈ విషయం అమెరికాలో చెప్పే ధైర్యం ఉందా బాబూ. మన రాష్ట్రంలో రైతులకు ఉన్న అప్పు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామట. ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి అమెరికాలో చెప్పే ధైర్యం ఉదా?
–వైయస్‌ఆర్‌ హయాంలో రైతులు సాగు విస్తిర్ణం   అక్షరాల 71 లక్షల హెక్టార్లలో సాగు చేసేవారు. చంద్రబాబు హయాంలో 54 లక్షలకు పడిపోయింది. రుణాలు మాఫీ చేస్తామని చెప్పడమో కాకుండా మోసం చేశారు. ఇటువంటి పెద్ద మనిషి అమెరికాలో రైతుల గురించి స్పీచ్‌ ఇస్తారట. దెయ్యలు వేదాలు వళ్లించినట్లు కాదా?
– పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల పరిస్థితి గమనించండి. ఎన్నికల సమయంలో పొదుపు రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఈ పెద్ద మనిషి చేసిన అన్యాయం ఏంటో తెలుసా? ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన వడ్డీ డబ్బులు బ్యాంకులకు చెల్లించకపోవడంతో సున్నావడ్డీ రుణాలు అందడం లేదు. 
– పిల్లల చదువుల గురించి ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఈయన నీరు గార్చారు. నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. ఆ పథకంలో పని చేసేవారికి జీతాలు ఇవ్వడం లేదు. చిన్న పిల్లలకు స్కూళ్లలో అధ్వాన్నమైన ఆహారం పెట్టిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం స్కూళ్లను మూత వేయిస్తున్నారు. రాష్ట్రంలో 20 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు సెప్టెంబర్‌ వచ్చినా ఇవ్వడం లేదు. గవర్నమెంట్‌ స్కూళ్లకు వెళ్లకుండా మానిపిస్తున్నారు. నారాయణ, శ్రీచైతన్య స్కూళ్లలకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ మన పిల్లలను ప్రైవేట్‌ బడికి పంపించాలంటే ఏడాదికి రూ.40 వేలు అవుతుంది. అదే నారాయణ, చైతన్య స్కూళ్లలో అక్షరాల లక్షలు గుంజుతున్నారు. పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ఒక్కడైనా ఉన్నత చదువులు చదవాలి. చంద్రబాబు దగ్గరుండి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పాతర వేస్తున్నారు. ఏడాదికి లక్ష ఇంజినీరింగ్‌ ఫీజులు లాగుతున్నారు. ఇవాళ చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది.
– చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అన్నారు. లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రూ.2 వేలు కాస్తా వెయ్యి చేశారు. రెండు కోట్ల 70 లక్షలు కేవలం పది లక్షల ఇళ్లకు పరిమితం అంటారు. ఉద్యోగాలు అంటారు..ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు. రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలకు నోటిఫికెషన్‌ ఇవ్వకుండా టెట్‌1, టెట్‌2, టెట్‌3 అంటూ మోసం చేస్తున్నారు. ఇవాళ కోచింగ్‌ కోసం విద్యార్థులు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు.
– పరిశ్రమలు అంటున్నారు. లక్షల ఉద్యోగాలు తెచ్చే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా ఉంటే ఇన్‌కంట్యాక్స్‌ కట్టాల్సిన పని ఉండదు. జీఎస్‌టీ మినహాయింపు ఉంటుంది. అలాంటి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈ మధ్యకాలంలో ఈజ్‌ ఆఫ్‌ డ్యూయింగ్‌ బిజినేస్‌ అంటున్నారు. ఈ బిజినెస్‌ ఏంటో తెలుసా? పరిశ్రమలకు  ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. రూ.6200 కోట్లు రాయితీలు ఇవ్వాలి ఉంది. ఈయనకు ఈజ్‌ ఆఫ్‌  డూయింగ్‌ అవార్డు  ఇవ్వడం విడ్డూరం. పరిశ్రమల పరిస్థితి చూస్తే సహకారంలోని చక్కెర ఫ్యాక్టరీలు, జూట్‌ మిల్లులు మూత పడుతున్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక కరెంటు చార్జీలు యూనిట్‌కు రూ.8.40 పెంచారు. నాన్నగారి పాలనలో రూ.3.15 ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిలో పరిశ్రమలు మూతపడక ఏం జరుగుతుంది.
– చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు అంటారు. పునాదులు దాటడం లేదు. ఆరోగ్యంలో ఉత్తమ ప్రమాణాలతో వైద్యం అందిస్తున్నాం అంటున్నారు. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇవాళ ఎలా ఉందో ఆలోచించండి. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. చంద్రబాబు మంత్రికి పంటి నొప్పి వచ్చి సింగపూర్‌కు వెళ్తే రూ. 3 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. పేదవారికి మాత్రం ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. ఇవాళ 108 అంబులెన్స్‌లో డీజిల్‌ లేదు. జీతాలు అందడం లేదు. 
– ఇవాళ రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. ఆ బియ్యంలో కూడా కోతలు విధిస్తున్నారు. చంద్రబాబు పుణ్యానా కరెంటు చార్జీలు బాదుడే బాదుడు..పెట్రోల్, డీజిల్‌ రేట్లు బాదుడే బాదుడు..ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందో గమనించండి
– పారదర్శక పాలన అంటున్నారు. ఇవాళ గ్రామాలకు వెళ్తే పింఛన్‌ కావాలన్నా..రేషన్‌కార్డు కావాలన్నా లంచం. చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు అడుగుతున్నారు. పింఛన్‌ అడిగితే ఏ పార్టీ అంటున్నారు. ఇంతటి దారుణంగా చంద్రబాబు హయాంలో పారదర్శక పాలన సాగుతోంది. 
– చంద్రబాబు ‘‘ నా వేలికి ఉంగరం లేదు’’,  నా చేతికి గడియారం ఉండదు’’ మెడలో గొలుసు ఉండదు అన్నారు. ఈయన అంత నీతిపరుడు ప్రపం^è ంలో ఎవరు ఉండరని బిల్డప్‌ ఇస్తారు. కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మాత్రం అడ్డగోలుగా కోట్లు డబ్బులు ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోతారు. ఏపీలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్లు ఇచ్చి సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారు. ఈ పెద్ద మనిషి తన రాజకీయ జీవితం రెండెకరాల భూమితో మొదలుపెట్టారు. ఇవాళ రూ.4 లక్షల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యారు. ఈ పెద్ద మనిషి హెరిటేజ్‌ షాపులు మాత్రం ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. 
– చంద్రబాబు పాలనలో ఇవాళ మట్టి, ఇసుక, బొగ్గు, మద్యం, కరెంటు కొనుగోళ్లను వదలిపెట్టడం లేదు. రాజధాని భూములు, విశాఖ భూములు, పేదవాడి భూములు..చివరికి గుడి భూములు కూడా వదలిపెట్టడం లేదు. 
– చంద్రబాబు హయం గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ ఆ చిన్న పిల్లలు ఆడుకునే ఆట గురించి చెప్పాను. ఏ నాయకుడైనా తనలో చిత్తశుద్ధి ఉంటే  మంచి జరుగుతుంది. ఇవాళ మన ఖర్మ ఏంటంటే..చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పే వ్యక్తి, మోసం చేసే వ్యక్తి, అవినీతి చేసే వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మనందరి పరిస్థితి అన్యాయంగా తయారైంది. 
– రేపు పొద్దున ఎన్నికలు వస్తాయి..మీరంతా కూడా ఆలోచన చేయండి. పొరపాటున కూడా అబద్ధాలు చెప్పే వ్యక్తికి, మోసాలు చేసే వ్యక్తికి ఓటు వేయవద్దని కోరుతున్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబును రేపు క్షమిస్తే..ఆయన ఏమంటారో తెలుసా? మొట్ట మొదట ఆయన మైక్‌ పట్టుకొని మీ అందరి చెవుల వైపు చూసి ఖాళీగా ఉన్నాయో లేదో గమనిస్తారు. తరువాత ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ కూడా 98 శాతం చేసేశానని చెవిలో పువ్వులు పెడతారు. బాగా పూలు పెట్టానని ఆయన అంతకు ఆయనే నిర్దారించుకొని, రేపు చిన్న చిన్న అబద్ధాలు, మోసాలకు నమ్మరని తెలుసు కాబట్టి..ఈ సారి చంద్రబాబుకు ఓటు వేస్తే కేజీ బంగారం  ఇస్తానని అంటారు. నమ్మరని ఆయనకు కూడా తెలుసు..కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటారు. నమ్మరని ఆయనకు తెలుసు..కాబట్టి ఏం చేస్తారో తెలుసా..ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తారు. ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. నమ్ముతారా? డబ్బులు ఇస్తే మాత్రం వద్దనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే..మన జేబుల్లో నుంచి తీసుకున్నవే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని మీ అందరిని కోరుతున్నాను. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయ, నిజాయితీ, మార్పు వస్తుంది. ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపు పొద్దున దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేయబోతున్నామని చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే, ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడాలని నవరత్నాలు ప్రకటించాం. నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్‌లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదని ఒక అంశాన్ని చెబుతున్నాను. ఈ మీటింగ్‌లో నవరత్నాల్లో నుంచి అవ్వాతాతలకు మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవ్వాతాతల పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తాను. నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. పింఛన్‌ రూ.2 వేలు చేస్తానని మాట ఇస్తున్నాను. మిగిలిన అంశాలన్నీ కూడా జరగబోయే ప్రతి సభలోనూ నవరత్నాలను ప్రస్తావిస్తా. మీరు ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి..స్వీకరిస్తాను. ఎవరైనా రావచ్చు. అర్జీలు ఇవ్వవచ్చు. సూచనలు ఇవ్వవచ్చు..చెడిపోయిన ఈ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా ఉండమని పేరు పేరున కోరుతూ హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.. 

 
Back to Top