ఆస్తులు అమ్మి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

ఏపీ అసెంబ్లీ: అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఆమ్మి బాధితులకు న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌జగన్‌ మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం సభ ప్రారంభం కాగానే అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ సందర్భంగా సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ సమస్య కూడా ప్రధానమైందని పేర్కొన్నారు. ఇందులో 30 లక్షల కుటుంబాలు బాధితులుగా ఉన్నారని,. నిత్యం ఈ సమస్యపై ఎక్కడో ఒకచోట బాధితులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వేలాది మంది రోడ్డున పడ్డారని, 105 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థ రూ.8 కోట్ల బకాయిలు ఉండగా, హాయ్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బులు ఇచ్చి ఉంటే ఆత్మహత్యలు ఆగేవి అన్నారు. ఈ కేసుపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. ఇలాంటి సమస్యపై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇవ్వగా ప్రభుత్వం ఒప్పుకోలేదని మండిపడ్డారు.

Back to Top