రెండో రోజు వైఎస్ జగన్ ప్రచారం

ఓరుగల్లులో విస్తృతంగా జననేత ప్రచారభేరి
అడుగడుగునా అపూర్వస్వాగతం

వరంగల్ః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండో రోజు ఓరుగల్లులో తన ప్రచారం కొనసాగిస్తున్నారు. వరంగల్ లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో ....వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామగ్రామన  ప్రజలు జననేతకు పెద్ద ఎత్తున అపూర్వస్వాగతం పలుకుతున్నారు.  ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ వెంట పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ , ఖమ్మం ఎంపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఇవాళ పరకాల నియోజకవర్గం ఆత్మకూరులో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడ రోడ్ షో నిర్వహించి , ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరినీ చేతులు జోడించి ఆత్మీయంగా నమస్కరిస్తూ కరచాలనం చేశారు. దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ . రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలన్నా, అభివృద్ధి ఫలాలు పేదలకు దక్కాలన్నా ...రాజన్న ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీతోనే సాధ్యమని వైఎస్ జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓరుగల్లు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఆత్మకూరులో పర్యటన అనంతరం శాయంపేట, రేగొండ మీదుగా వైఎస్ జగన్ భూపాలపల్లికి చేరుకొని ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం పరకాల  బహిరంగ సభలో పాల్గొంటారు. వరుసగా నాలుగు రోజులపాటు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ప్రచారభేరి కొనసాగుతుంది.

Back to Top