విశాఖ నగరంలో తలపెట్టిన జై ఆంధ్ర ప్రదేశ్ భారీ బహిరంగ సభా వేదిక వద్దకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఇప్పుడే చేరుకున్నారు. పార్టీ నాయకులు జననేతకు ఘన స్వాగతం పలికారు. జననేతను చూసిన ప్రజలు కోరింతలు కొట్టారు. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. జై ప్రత్యేకహోదా, జై ఆంధ్రప్రదేశ్, జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. <br/>వేదికపైకి చేరుకున్న వైయస్ జగన్ ముందుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, తెన్నెంటి విశ్వనాథం, గురజాడ అప్పారావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతీ ఒక్కరికీ చిరునవ్వులతో చేతులు జోడించి అభివాదం చేశారు. అనంతరం వేదికపై ఆశీనులయ్యారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని వైయస్ జగన్ కాసేపట్లో ఎండగట్టనున్నారు. <br/>