నాలుగేళ్ల‌కోసారి భార్య‌ల‌ను మార్చ‌డం మ‌గ‌త‌న‌మా?

శ్రీ‌కాకుళం:  నాలుగేళ్ల‌కోసారి భార్య‌ల‌ను మార్చ‌డం మ‌గ‌త‌న‌మా అని చంద్ర‌బాబు పార్ట్‌న‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. రాజాం స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌ 2014 నుంచి 2018 వరుకు నాలుగున్నరేళ్ల వరుకు చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తాడు. చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్ధంతోనూ,చేసిన ప్రతి మోసంలోనూ, చేసిన అవినీతిలోనూ భాగస్వామి కాదా.. తెర ముందు దోస్తీ, ఎన్నికలు ఆరునెలలు ముందు చంద్రబాబుతో పవన్‌ విడిపోయినట్లుగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసి లాలూచీ చేస్తాడు. .నేడు నిజంగా చంద్రబాబు విలువలు,విశ్వసనీయతలేని రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు స్క్రిప్టు రాసి డైరెక్షన్‌ చేస్తాడు.యాక్షన్‌ మాత్రం పవన్‌కల్యాణ్‌ ది.అదే సినిమాకు నిర్మాత లింగమనేని. పవన్‌ సినిమాకు ఇంటర్వెల్‌ ఎక్కువ సినిమా తక్కువ. చంద్రబాబు ఎప్పుడు డబ్బులిస్తే అప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా కాల్షిట్లు ఇస్తుంటాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా నేడు రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో..ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఆయన అధర్మం మీద పోరాటం చేస్తున్నాం. అన్యాయంపై,అవినీతిపై పోరాటం చేస్తున్నాం. నాలుగున్నర సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏమి జరిగిన కూడా అక్కడ కనిపించే వ్యక్తి ఎవరైనా ఉంటే అది జగన్‌ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది పవన్‌కల్యాణ్‌ అనేవ్యక్తి చద్రబాబు పరిపాలన లో ఆయన పార్ట్‌నర్‌ గా ఉంటూ ఆయన చేసిన మోసం, అవినీతిలో  ఉన్న వ్యక్తి చంద్రబాబు పాలన మీద  తక్కువ మాట్లాడతాడు. జగన్‌ అవినీతిపరుడు  అంటాడు. పవన్‌ను అడుగుతున్నా జగన్‌ అవినీతి పరుడు అని నువ్వు చూశావా అని అడుగుతున్నా. దివంగత నేత వైయస్‌ఆర్‌ పాలన గురించి పవన్‌కల్యాణ్‌కు ఏం తెలుసు అని అడుగుతున్నా వైయస్‌ఆర్‌ పాలన చూడలేదు. సినిమాలో ఉన్నాడు.నాలుగున్నరేళ్లలో చంద్రబాబు అవినీతి గురించి పక్కన పెట్టి  గత వైయస్‌ఆర్‌ పాలన గురించి మాట్లాడతాడు . ఈ మధ్యకాలంలో మగగతనం గురించి మాట్లాడుతున్నాడు. నలుగురు భార్యలను పెళ్ళి చేసుకుంటాడు. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చేస్తాడు. దేశంలో  పవిత్రమైన వ్యవస్థ ఉందంటే పెళ్ళి అనే వ్యవస్థ. అటువంటి వ్యవస్థను  రోడ్డుమీదకు విసిరేశాడు. నిత్య పెళ్లికొడుకుగా నాలుగేళ్లకోసారి భార్య‌ల‌ను మార్చడం.. ఇదేనా మగత‌నం అని అడుగుతున్నా. పవన్‌కల్యాణ్‌ రెండో భార్య రేణదేశాయ్‌ అంట.. తాను కాపురం చేస్తూనే ఉండగానే వేరోక స్త్రీకి గర్భం చేసి ఇంటికి తీసుకువచ్చాడని అని ఆమె టీవీలో అన్న మాట..అందుకు ఆయన గారి కార్యకర్తలు సోషల్‌ మీడియాలో  వేధిస్తే  మౌనంగా ఉండటమేనా మగతనం అంటే అని అడుగుతున్నా..కొత్తకారులను మార్చినట్లు  పెళ్ళాలను మారుస్తున్న పవన్‌ కల్యాణ్‌ తప్పును ఎవరైనా  ఎత్తిచూపిస్తే ఆ ఎత్తిచూపిన వ్యక్తుల ఇంటిలోని ఆడవాళ్ల మీద లేనిపోని అబద్ధాలు సోషల్‌ మీడియాలో సిగ్గులేకుండా పెట్టిస్తాడు. అది మగతనమా అని అడుగుతున్నా..  

తాజా వీడియోలు

Back to Top