దివ్యాంగురాలికి వైయస్‌ జగన్‌ భరోసా

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిన్నతాళ్లపొలం వద్ద వైయస్‌ జగన్‌ను దివ్యాంగురాలు కలిశారు. టీడీపీ నేతలు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ఆసుపత్రికి సర్టిఫికెట్‌ కోసం వెళ్తే తనను తోసేశారని, అప్పుడే తాను సవాలు చేసినట్లు చెప్పారు. ఐదేళ్లు ఆగితే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడే పింఛన్, రేషన్‌కార్డు తీసుకుంటానని శపథం చేసినట్లు వైయస్‌ జగన్‌కు వివరించారు. ఆమె ఆవేదన విన్న వైయస్‌ జగన్‌ ..మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని ఆమెకు భరోసాకల్పించారు.
 
Back to Top