సంక్షేమ పథకాలు అందడం లేదు
నెల్లూరు: గ్రామాల్లో జన్మభూమి కమిటీలు అరాచకాలు సృష్టిస్తున్నాయని, సామాన్యులకు సంక్షేమ పథకాలు అందడం లేదని నెల్లూరు వాసులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 87వ రోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతిపక్ష నేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పింఛన్లు మంజూరు చేయడం లేదని, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి పనులు చేసి మూడు నెలలు అవుతున్నా బిల్లులు అందడం లేదని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ఏడాది పాటు ఓపిక పట్టాలని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే 45 ఏళ్లకే పింఛన్‌ మంజూరు చేస్తామని, నెలకు రూ.2 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top