ఫ్యాన్‌ గుర్తుకే ఓటేస్తాం.. జగనన్నను సీఎం చేస్తాం

అనపర్తి నియోజకవర్గ ప్రజానికం
తూర్పుగోదావరి: ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని, వైయస్‌ జగన్‌ను సీఎంను చేసుకొని మా బతుకులు బాగుచేసుకుంటామని వారంతా అంటున్నారు. అనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ మేరకు వైయస్‌ జగన్‌ను కలిసిన ప్రజలు మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో గుండె ఆపరేషన్‌ చేయించుకొని బతికిబట్టకట్టానని పల్లె ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబానికి పెట్టే గుణం ఉందని, చంద్రబాబు కుటుంబానికి లాక్కుని, హింసించే గుణం ఉందన్నారు. తప్పకుండా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుంటామన్నారు. 
Back to Top