– 9 నియోజకవర్గాల్లో వైయస్ జగన్ పాదయాత్ర– 255 కిలోమీటర్ల మేర 20 రోజులకు పైగా యాత్ర– రూట్ మ్యాప్ ఖరారు ఒంగోలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 17వ తేదీన ప్రకాశం జిల్లాలోకి ప్రారంభం కానుంది. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను పార్టీ నేతలు ఖరారు చేశారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 255 కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శి, జిల్లా పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించి యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేశారు. కందుకూరు, కొండపి, కనిగిరి, మార్కాపురం, పర్చూరు, చీరాల నియోజకవర్గాల గుండా వైయస్ జగన్ పాదయాత్ర సాగనుంది. జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. నెల్లూరు జిల్లా నుంచి యాత్ర కందుకూరు నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తుంది. లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు మండలాల్లో యాత్ర కొనసాగనుంది. పార్టీ జిల్లా నేతలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, స్థానికులు అశేషంగా తరలివచ్చి జిల్లాలోకి ప్రవేశించే వైయస్ జగన్ పాదయాత్రకు ఘనస్వాగతం పలకటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.