మహాత్ముడికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు


విజ‌య‌న‌గ‌రం: భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర‌ప‌టానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం జననేత 276వ రోజు పాదయాత్ర ప్రారంభం ముందు గాంధీ జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్బంగా గాంధీజీ దేశానికి చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఆయ‌న బాట‌లో న‌డుద్దామ‌ని, మ‌హాత్ముడి ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు.  జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌ చేశారు.  



Back to Top