ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైయస్ జగన్

  • ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపక్ష నేత
  • వైయస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న జననేత
వైయస్ఆర్ జిల్లా: వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ జిల్లాలో రెండ్రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే ఎస్‌బీ అంజాద్‌బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మతగురువు వల్లీఉల్లా రంజాన్‌ ఉపవాసదీక్ష విశిష్టత వివరించారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షను విరమింపజేశారు. అంజాద్‌బాషా మతగురువులతో కలసి జగన్‌కు ఫలహారం తినిపించారు.

ముస్లిం సోదరులకు తన తరుఫున, పార్టీ తరుఫున జగన్‌ ముందస్తుగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అంజాద్‌బాషా మాట్లాడుతూ వైయస్సార్‌ జిల్లా మత సామరస్యానికి మారుపేరుగా నిలుస్తోందన్నారు. జిల్లా వాసులంతా ఇఫ్తార్‌లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నదీమ్‌ అహమ్మద్, కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌.రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పి.రవీంద్రనాథరెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఎస్‌బీ అహ్మద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు: కడపలోని అమీన్‌పీర్‌ దర్గా (పెద్దదర్గా)లో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ప్రార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్‌విందు అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్‌ ఆరీపుల్లా హుస్సేనీ సాహెబ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం పెద్దదర్గా మజార్లుకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఎంపీ వైయస్‌ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి వైయస్‌ జగన్‌ పూలచాదర్‌ను సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు.

తాజా ఫోటోలు

Back to Top