ఒంటిమిట్ట రామాలయంలో వైఎస్ జగన్ పూజలు

వైఎస్సార్ జిల్లా)
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రముఖ పుణ్యక్షేత్రం
ఒంటిమిట్ట కోదండ రాముడ్ని సందర్శించుకొన్నారు. ఉదయమే కడప చేరుకొని, అక్కడ నుంచి
ఒంటిమిట్టకు వెళ్లారు. ఆయన వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల
శ్రీనివాసులు, ఎమ్మెల్యే అంజద్ బాషా, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్
రెడ్డి తదితరులు ఉన్నారు. ఆలయ లాంఛనాలతో అక్కడ స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్
దేవాలయం రథోత్సవంలో పాల్గొన్నారు. స్వయంగా కొంతదూరం రథాన్ని లాగారు. అనంతరం
దేవాలయంలోకి వెళ్లి సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. 

Back to Top