తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు

విజయనగరం: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుమీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయ దశమి పండుగ తెలుగు రాష్ట్రల ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తివంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్నారు. లోకంలోని ప్రజలందరినీ రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సుఖశాంతులు, సిరి సంపదలు ప్రసాదించాలని కాంక్షించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top