పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి పాదయాత్రగా వైఎస్ జగన్

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. అంతకుముందు  రవీంద్రభారతి సర్కిల్‌కు చేరుకన్నారు.  అక్కడ ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం నుంచి  అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు. 

18 రోజుల పాటు సాగే ఈ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. టీడీపీ ప్రభుత్వంపై  వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది.  
Back to Top