ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?

  • బాబు చర్మం బాగా మందమెక్కింది
  • కిడ్నీ బాధితుల గోడు పట్టడం లేదు
  • ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు
  • జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో వైయస్ జగన్
శ్రీకాకుళంః రాష్ట్రంలో చంద్రబాబు దారుణమైన పాలన సాగిస్తున్నారని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జగతి గ్రామంలో కిడ్నీ బాధితులు పడుతున్న బాధను వైయస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే.....

ప్రభుత్వం  దారుణంగా వ్యవహరిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు, కనిగిరిలో కిడ్నీ బాధితులను కలిశాం. వారి పక్షాన ధర్నాలు చేశాం. ఇవాళ ఉద్ధానం ప్రాంతం  జగతిలో  కిడ్నీ వ్యాధిగ్రస్తులు పడాతవున్న ఇబ్బందులు చూపిస్తున్నాం. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ఎంత దారుణంగా జరుగుతుందంటే.... హెల్త్ డిపార్ట్ మెంట్ గవర్నమెంట్ కు రూ.1400కోట్లు అవసరమని అడిగింది. కానీ బాబు బడ్జెట్ లో వేయి కోట్లు  మాత్రమే కేటాయింపులు చేశాడు. ఆ వేయి కోట్లలో రూ. 480 కోట్లు నిరుడు బకాయిలే. ఇంత దారుణంగా ఆరోగ్యశ్రీని నడిపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్ ఆస్పత్రికి పోతే వైద్యులు వైద్యం చేయని పరిస్థితి. గత 7, 8 నెలలుగా ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని డాక్టర్లు వైద్యం చేయడం లేదు. నాన్న గారు వైయస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పదేళ్లవుతుంది. పదేళ్ల కిందట ఫిక్స్ చేసిన రేట్లే ఇస్తామంటే ఎలా అని వైద్యులు అంటున్నారు. కరెంట్ దగ్గర్నుంచి ప్రతిది పెరుగుతూ వస్తున్నందున కేటాయింపులు పెంచమంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో, ఆస్పత్రుల్లో వైద్యులు కొన్ని సర్జరీస్ ముట్టుకోవడం లేదు.  మరోవైపు, హాస్పిటల్స్ గవర్నమెంట్ కు అప్లికేషన్ పెట్టుకున్నా బిల్లులు రాని పరిస్థితి.

ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 108కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లోనే కుయ్ కుయ్ అంటూ వచ్చి పెద్ద హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం చేయించి పేదవాడిని చిరునవ్వుతో ఇంటింకి పంపించే పరిస్థితి ఉండేది. 108లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం 2 ,3 నెలలుగా జీతాలు కూడ ఇవ్వడం లేదు.  108కు ఫోన్ కొడితే డీజిల్ బిల్లులు ఇవ్వడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది బాబు పాలన తీరు. కిడ్నీ పేషెంట్లు మందుల నుంచి డయాలసిస్ పరిస్థితికి, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కు పోయే పరిస్థితి వస్తుంది. నడవలేని వాళ్లు. వృద్ధులుకు  మందులిచ్చే కార్యక్రమం చేయడం లేదు. ఇవాళ 104 ఎక్కడుందో వెతుక్కునే పరిస్థితి గ్రామాల్లో కనబడుతోంది. కిడ్నీ, కాక్లియర్ ఇన్ ప్లాంట్ ఆపరేషన్ వైద్యం అందని పరిస్థితి నెలకొంది. మూగ, చెవిటి వారికి ఆపరేషన్ చేసి వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించడానికి. 6లక్షల పైన ఖర్చు అవుతుంది. నాన్న బతికున్నప్పుడు పిల్లాడు మూగ, చెవుడుతో ఉండకూడదని ఎంతఖర్చైనా సరే ఆపరేషన్ అందాలని చెప్పి ఆపరేషన్ జరిపించారు. చంద్రబాబు మాత్రం ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలన్న ఆలోచన చేస్తున్నారు. పిల్లాడు 2 ఏళ్ల లోపే ఉండాలట. పిల్లాడికి మూగ, చెవుడు ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం కూడ ఆతల్లికి ఇవ్వకుండా కత్తిరిస్తున్నారు. ప్రభుత్వం రూ. 6లక్షలు తగ్గించుకోవాలన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది.

క్రియాటిన్ లెవల్స్ 1.4 కన్నా ఎక్కువున్న పరిస్థితుల్లోంచి మందులు ఇస్తూ లెవల్ తగ్గించే ప్రయత్నం చేస్తారు.  వారానికోసారి ఇంజక్షన్స్ వేయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి దాదాపుగా రూ. 600 నంచి రూ.1400 పరిస్థితిని బట్టి ఇస్తారు. ఆర్థికస్థోమత బాగుంటే పేషెంట్ ఎక్కువ రోజులు బతకాలంటే వైద్యులు చెప్పిన ప్రకారం చేసుకోవాలి. రూ. 2 వేల నుంచి 5 వేలు మందులకు ఖర్చవుతుంది. ఇటువంటి స్టేజ్ నుంచి 3,4 సంవత్సరాల వరకు మందులు తింటున్న పరిస్థితి నుంచి డయాలసిస్ కు వెళతారు. ఒక్కసారి డయాలసిస్ ఖర్చు రూ.2 నుంచి 3 వేలు అవుతుంది.  వారానికి 2, 3సార్లు చేయాల్సిన పరిస్థితి. అంటే నెలకు రూ.25వేలు ఖర్చు వస్తోంది. ఆ తర్వాత స్టేజ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్. ఇందుకు పది లక్షలు ఖర్చవుతుంది. మందులకోసం మళ్లీ ఖర్చు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పేషెంట్లున్నప్పుడు ప్రభుత్వం కనీసం ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ధర్నాలు ఇవన్నీ చేస్తున్నాం. ఒంగోలు, కనిగిరిలో చేసిన ధర్నాలో పేషెంట్లతో మాట్లాడించాం. బాబులో కదలిక వస్తుందనుకున్నాం.  మన కర్మకొద్దీ రాలేదు. ఈ ఉద్ధానం నుంచైనా వస్తుందేమో చూద్దాం. బాబు చర్మం మందం. మనం అనుకున్నంత స్పీడ్ లో రాకపోవచ్చు. కానీ మన ప్రయత్నంగా ఒత్తిడి తీసుకొస్తేనే కదలిక వస్తుందని వైయస్ జగన్ అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top