నెల్లిమ‌ర్ల‌లోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌



- జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం
విజ‌య‌న‌గ‌రం:   ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైయ‌స్‌ జగన్ పాదయాత్ర సాగుతున్న విజయనగరం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. కొద్దిసేప‌టి క్రితం జననేత పాదయాత్ర నెల్లిమర్ల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సాంస్కృతిక సంబ‌రాల‌తో జ‌న‌నేత‌కు స్వాగ‌తం ప‌లికారు. జననేత 276వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని కొత్తపేట నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి సంకేటి వీధి, కుమ్మరి వీధి, వైయ‌స్ఆర్‌ నగర్‌, కొండకరకాం వరకు పాదయాత్ర కొనసాగింది.  భోజన విరామం అనంత‌రం తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభం కాగానే నెల్లిమర్ల నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర  సాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మధ్యాహ్న భోజన కార్మికులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.  పారిశుద్ధ్య కార్మికులు, జేఎన్‌యూ కాంట్రాక్టు ఉద్యోగులు, 104 కార్మికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. 
Back to Top