ఇంతటి రాజకీయమా చంద్రబాబూ


తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ
వేదికగా పాల్పడుతున్న నీచ రాజకీయాల్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ తూర్పార బట్టారు.
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున కాల్ మనీ సెక్సు రాకెట్ అంశం మీద ఇచ్చిన వాయిదా
తీర్మానం మీద ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారు. సాంప్రదాయాల ప్రకారం విపక్షనేత గా
వాయిదా తీర్మానం ప్రాధాన్యాన్ని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. స్వయంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర రావు తో కాల్ మనీ
నిందితులు దిగిన ఫోటోల్ని చూపించారు. ఈ చర్య ఎంతటి హేయమైనదో ఆయన సభకు తెలియ
చెప్పేందుకు ప్రయత్నించారు.

తర్వాత దశలో అంబేద్కర్
పేరును వాడుకొనేందుకు అధికార తెలుగుదేశం సాగిస్తున్న కుట్రల మీద మండిపడ్డారు.
అంబేద్కర్ ను రాజకీయాలకు వాడుకొంటున్నారని, దీంతో ఆయన ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన
వ్యక్తం చేశారు. నిందితులతో కలిసి ఎమ్మెల్యేలు విదేశాల్లో షికారు కొడతారని, కానీ ఆ
ఎమ్మెల్యేను కనీసం విచారించేందుకు కూడా ప్రయత్నించటం లేదని మండి పడ్డారు. 

తాజా వీడియోలు

Back to Top