రోశ‌మ్మ మృతిపై వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

హైద‌రాబాద్‌) సామాజిక పోరాట‌కారిణి దూబగుంట రోశమ్మ మృతి పట్ల ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన దూబగుంట రోశ‌మ్మ మ‌ద్య‌పాన నిషేధ  ఉద్య‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు గాంచారు.  మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న వేళ మహిళాలోకం నడుం బిగిస్తే ప్రభుత్వాలు దిగి రాక తప్పదని రోశమ్మ పోరాటం నిరూపించిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని కోరుతూ నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ 1990 ప్రాంతంలో ప్రారంభించిన మహోద్యమం తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన అధ్యాయం అని జగన్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే మహోద్యమాలను గ్రామాల నుంచి నిర్మించవచ్చని రోశమ్మ నిరూపించారని ఆయన అన్నారు. రోశమ్మకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Back to Top