యూపీఎస్‌సీ టాప‌ర్స్‌కు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

విజ‌య‌వాడ‌:  యుపిఎస్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన టాప‌ర్స్‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. యుపిఎస్సి శుక్రవారం ప్రకటించిన తుది ఫలితాల్లో భారత రెవెన్యూ సర్వీసెసుకు సేవలందిస్తున్న దురైశెట్టి అనూదీప్ 2017 సంవత్సరానికి సివిల్ సర్వీస్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే 6వ స్థానంలో శ్రీ‌హ‌ర్ష‌, పృధ్వీతేజ్‌,  సాయితేజ‌, భార్గ‌వ‌తేజ‌, శౌర్య త‌దిత‌రులు తెలుగు రాష్ట్రాల‌కు న‌ల‌భైకి పైగా ర్యాంకులు సాధించారు. వీరంద‌రిని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శంసించారు. వారంద‌రి విజ‌యం వెనుక చాలా కృషి ఉంద‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో వీరి విజ‌యం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. భ‌విష్య‌త్తులో మ‌రెన్నో విజ‌యాలు సొంతం చేసుకోవాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు. 
Back to Top