హైదరాబాద్)) రక్షా బంధన్ రోజు తెలుగు చెల్లెమ్మ అందించిన తీపి గుర్తు. ఒలింపిక్స్ లో ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన షట్లర్ సింధు కి ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. పీవీ సింధు కి శుభాకాంక్షలు. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శన. ఫైనల్స్ లో గెలిచి స్వర్ణం గెలవాలని ఆకాంక్ష" అంటూ వైయస్ జగన్ అభిప్రాయ పడ్డారు.అటు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పీవీ సిందుకి అభినందనలు తెలుపుతూ ఒక పత్రికా ప్రకటన విడుదల అయింది. Congratulations @Pvsindhu1. Amazing performance. Go for gold. #Rio2016