విజయనగరం: ఎమ్మెల్సీ, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మూర్తి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.<br/>అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి కన్నుమూశారు. ఈనెల 6న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్లారు. వైల్డ్ సఫారీని చూసేందుకు ఐదుగురు సభ్యులతో కలిసి కాలిఫోర్నియా నుంచి అలస్కాకు కారులో వెళ్తుండగా ఆంకరేజ్ సిటీ దగ్గర మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎంవీవీఎస్ మూర్తితోపాటు మరో (బసవ పున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరి) ముగ్గురు మరణించగా, ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.