వైయస్ జగన్ సంతాపం

హైదరాబాద్‌ : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, టీటీడీ మాజీ ఈవో పీవీఆర్‌కే ప్రసాద్‌ (77) మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన గుండెపోటుతో కేర్‌ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పీవీఆర్‌కే ప్రసాద్‌ కుటుంబసభ్యులకు వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 పీవీఆర్‌కే ప్రసాద్‌ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సలహాదారుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అలాగే తిరుమల ప్రాశస్త్యంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పీవీఆర్‌కే  కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Back to Top