వైయ‌స్ జ‌గ‌న్‌పై హత్యాయత్నం కేసు జనవరి 4వ తేదీకి వాయిదా హైదరాబాద్‌ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసుపై ఇవాళ‌ హైకోర్టు విచారణ జరిపింది.  ఎన్‌ఐఏ యాక్ట్‌ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్షాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయటంపై తమ నిర్ణయాలను చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. 

తాజా వీడియోలు

Back to Top